బంగారు బాబు.. బంగారంతో మాస్క్ చేయించుకున్నాడు మరి..

బంగారు బాబు.. బంగారంతో మాస్క్ చేయించుకున్నాడు మరి..
X

ఎన్-95 మాస్క్ మంచిది. అది వాడితే కరోనా వైరస్ దరి చేరదంటే సరే నంటూ కొందామని వెళితే రేటు రూ.350 చెప్పేసరికి గుండె గుభేల్ మంటుంది. దాన్ని మూడు రోజులు మాత్రమే ధరించాలని చెప్పేసరికి వద్దులే బాబు.. మాములు మాస్క్ ఇచ్చేయ్.. అదైతే ఒకసారి పెట్టుకుని పడేయొచ్చు పైగా పది రూపాయల్లో వస్తుంది అని అనుకుంటాం. మరి రూ.2 లక్షల 90 వేలు అంటే సుమారుగా రూ.3లక్షలు పెట్టి ఏకంగా బంగారంతో మాస్క్ తయారు చేయించి పెట్టుకున్నారు పూణెకు చెందిన ఓ వ్యక్తి. బంగారంతో నోట్లో పళ్లే కాదు.. బాత్ రూమ్ లో కమోడ్లు కూడా తయారు చేయించుకుంటున్నారు బంగారు బాబులు.

కరోనా సీజన్ కదా వెరైటీగా వుంటుందని మాస్క్ ని బంగారంతో తయారు చేయించేశారు పింప్రి చించ్ వాడకు చెందిన శంకర్ కుర్ హేడ్. ఈ మాస్క్ తయారీ కోసం సుమారు అయిదున్నర తులాల బంగారం ఉపయోగించారట. అయిదు వేళ్లకు అయిదు బంగారు ఉంగరాలు.. మెడలో భారీగా ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇప్పుడు మాస్క్ కూడా బంగారందే. మాస్క్ మందంగా ఉన్నా ఊపిరి బాగానే ఆడుతుందని అంటున్నారు శంకర్. దానికి చిన్న చిన్న రంద్రాలు పెట్టించారట. శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి. మరి ఈ మాస్క్ లోకి కరోనా వైరస్ చొరబడకుండా ఉంటే సంతోషం. ఎంత వరకు పని చేస్తుందో చెప్పలేమంటున్నారు.

Tags

Next Story