తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి : వాతావరణ శాఖ

తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి : వాతావరణ శాఖ

తెలంగాణలో పలు ప్రాంతాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గర పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆదివారం పలుచోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story