కరోనాని సూచించే మరికొన్ని కొత్త లక్షణాలు..

కరోనాని సూచించే మరికొన్ని కొత్త లక్షణాలు..

ఈ మధ్య ఎవరైనా దగ్గినా, తుమ్మినా కరోనానేమో అని అనుమానించాల్సి వస్తోంది. విచిత్రంగా ఏ లక్షణాలు లేకుండా టెస్ట్ చేయించుకుంటే కూడా పాజిటివ్ అని రిపోర్ట్ వస్తుంది. దాంతో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియకుండా పోతోంది. తాజాగా ఒళ్లు నొప్పులుగా అనిపించినా, విరోచనాలు అవుతున్నా కరోనా వైరస్ గా అనుమానించాల్సిందే అంటున్నారు వైద్యులు. అసలు కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిస్తే..

దగ్గు: ఆగకుండా దగ్గు వస్తుంటే అందులో డౌట్ లేదు. అది కరోనాయే. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఒక్కోసారి స్వల్పంగా దగ్గు ఉన్నా పాజిటివ్ వస్తుంది.

జర్వం: కరోనా రోగికి జ్వరం రావడం అనేది ప్రధాన లక్షణం. 100.6 డిగ్రీల ఫారన్ హీట్ చూపిస్తుంది.

నీరసం: కొవిడ్ వచ్చిందంటే బాగా నీరసంగా అనిపిస్తుంది. త్వరగా అలసిపోతారు.

వాసన తెలియదు.. రుచిని కోల్పోతారు.. చలిగా వుంటుంది. ఇవన్నీ వైరస్ సంకేతాలు. కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, విరోచనాలు, మరి కొంతమందిలో వాంతులు, చర్మంపై దద్దుర్లు, వికారం, నడుం నొప్పి వంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి.

కొంత మందికి వైరస్ శరీరంలో ప్రవేశించిన 5 రోజులకు లక్షణాలు బయటపడితే, మరి కొంత మందికి 14 రోజులకు బయటపడతాయి.

Tags

Read MoreRead Less
Next Story