జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దకుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కి కరోనా సోకింది. జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గిల్‌ఫోయల్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అమెరికా మీడియా పేర్కొంది. కింబర్లీ గ్యుయల్‌ఫాయల్ గతంలో ఫాక్స్ టెలివిజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా ఆమె.. ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం వినేందుకు దక్షిణ డకోటా రాష్ట్రానికి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ట్రంప్‌ను కలిసేవారందరికీ అక్కడి అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కింబర్లీ కూడా కరోనా బారిన పడ్డట్టు వెల్లడైంది. విషయం తెలియగానే అధికారులు ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆమె బాగానే ఉందని.. ఆమెలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినప్పటికీ మరోసారి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామని ట్రంప్ క్యాంపెయిన్ ఫినాన్స్ కమిటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సెర్గియో గోర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com