43 మందిని బలిగొన్న పిడుగులు

43 మందిని బలిగొన్న పిడుగులు
X

ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్లా పిడుగులు కూడా పడుతున్నాయి. దీంతో ప్రజలను భయబ్రాంతులకు గురవుతున్నారు. శనివారం ఆయా రాష్ట్రాల్లో పిడుగులు పడి 43మంది మరణించారు. అలాగే మరి కొంతమంది గాయాలపాలయ్యారు. ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పిడుగులు పడటంతో 23మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 30మంది గాయపడ్డారు. ఇందులో ప్రయాగ్‌రాజ్ జిల్లాలోనే అత్యధికంగా 8మంది మరణించినట్లు అధికారులు నివేదించారు.

ఇక బిహార్ పిడుగుల కారణంగా 20మంది మరణించినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలియజేసింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా భోజ్‌పూర్ జిల్లాలో 9 మంది మరణించారు. 20 మంది మరణించడం పట్ల బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి రూ .4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Tags

Next Story