దేశప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

దేశప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
X

దేశప్రజలకు ప్రముఖులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘జీవితాలను ఓ అర్థవంతంగా తీర్చిదిద్దిన గురువులను మనం గుర్తు చేసుకోవలసిన రోజు ఈ రోజుని.. గురు పౌర్ణమి సందర్భంగా గురు పరంపరకు సాదర నమస్కారాలు’’ అని ట్వీట్ చేశారు.

అటు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ట్వీట్ చేశారు. ‘‘ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం చాలా ప్రముఖమైంది. జ్ఞానాన్ని, శిష్యుడ్ని జోడించడానికి గురువు సేతువు లాంటివారు. ఒక గురువు తన జ్ఞానామృతంతో శిష్యునిలో ధర్మాన్ని పెంపొందిస్తారు. దీని ద్వారా శిష్యుడికి సరైన దిశను, జీవితానికి సరైన అర్థాన్ని గురువు అందిస్తారు’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Tags

Next Story