చైనాకు భారీ షాక్ ఇచ్చిన యాపిల్ సంస్థ

చైనాకు భారీ షాక్ ఇచ్చిన యాపిల్ సంస్థ

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరువాత.. డ్రాగన్ కంట్రీకి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. ఇప్పటికే భారత్ నుంచి భారీ డిజిటల్ స్ట్రైక్ ను ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా దిగ్గజ ముబైల్ సంస్థ యాపిల్ నుంచి ఊహించని షాక్ కు గురైంది. చైనీస్ యాప్ స్టోర్ లోని 4500 ముబైల్ గేమ్స్ ను తొలగించింది. దీంతో చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన యాపిల్ సంస్థ.. గేమింగ్ లైసెన్స్ నిబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని.. ఇందులో భాగంగా గేమ్స్ తొలగించామని అన్నార. చట్టపరమైన అనుమతి లేకుండా చాలా గేమ్స్ యాప్ లో ఉంచుతున్నారని అన్నారు. అందుకు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. గత ఏడాది నుంచి ఈ నిర్ణయాన్ని ప్రకటించామని.. ఉన్నఫలంగా తీసుకున్న నిర్ణయం కాదని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. లైసెన్స్‌ నిబంధనలను తిరిగి పునరుద్ధించిన అనంతరం చట్ట ప్రకారం అప్లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, యాపిల్ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో చైనాకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story