మాస్క్ ధరించండి అన్నందుకు పోలీసులపైనే దాడి..

ముఖానికి మాస్క్ పెట్టుకోమన్నందుకు పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడో బీజేపీ స్థానిక నాయకుడు. ఈ ఘటన ఉత్తప్రదేశ్ లో జరిగింది. దాడికి గురైన వారిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. వారణాసి పట్టణానికి చెందిన బీజేపీ నేత సురేందర్ పటేల్ అతని కుమారుడు వికాస్ ముఖాలకు మాస్కులు
ధరించకుండా బయట తిరుగుతున్నారు. దాంతో పోలీసులు వారిని ఆపి మాస్కులు ధరించాలని సూచించారు. దీంతో వారు పోలీసులపై దుర్భాషలాడారు.. ఈ సమయంలోనే అక్కడికి మరికొందరు యువకులు కూడా చేరుకున్నారు. ఇదే అదనుగా భావించిన సురేందర్ పటేల్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
ఈ క్రమంలో ముగ్గురు పోలీసుపై దాడికి పాల్పడ్డారు. వీరిలో ఓ ఎస్సై కూడా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సురేందర్ పటేల్ అతని కుమారుడు వికాస్ అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనలో గాయపడ్డ పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వారణాసి బీజేపీ చీఫ్ మహేష్ చంద్రా శ్రీవాస్తవా ఘటనను తీవ్రంగా ఖండించారు. కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసులపై దాడికి పాల్పడం సరైంది కాదని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com