59 మొబైల్ యాప్‌ల నిషేధానికి చైనా ప్రతీకారం

59 మొబైల్ యాప్‌ల నిషేధానికి చైనా ప్రతీకారం

గాల్వన్ వ్యాలీలో భారత్ చైనా దేశాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు, 40 మందికి పైగా చైనీయులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం భారత ప్రభుత్వం 59 చైనా యాప్ లను నిషేధించింది. అయితే యాప్ ల నిషేధం పట్ల అగ్గిమీద గుగ్గిలం అవుతున్న చైనా అందుకు ప్రతీకారం తీర్చుకుంది. చైనాలోని ప్రధాన భూభాగంలో WION వెబ్‌సైట్.. www.wionews.com ను బ్లాక్ చేసింది.

ఈ విషయాన్నీ చైనా ఇంటర్నెట్ పర్యవేక్షణ వాచ్‌డాగ్ అయిన GreatFire.org ధృవీకరించింది. WION న్యూస్ గత కొద్దిరోజులుగా చైనాలో కరోనావైరస్ విజృంభణ, కేసులను కప్పిపుచ్చే ధోరణిపై కథనాలను రాసింది. దాంతో జిన్‌పింగ్ WION కథనాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనే కాదు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్,కూడా WION పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో యాప్ ల నిషేధం వంకతో దీనిని బ్లాక్ చేశారు.

Tags

Next Story