జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయిల్స్..

జూలై 7 నుంచి నిమ్స్ లో వ్యాక్సిన్ ట్రయిల్స్..

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఆవశ్యకత ఎంతో ఉంది. తుది రూపు దాల్చుకున్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ మనుషులపై ప్రయోగించేందుకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రులను ఎంపిక చేసింది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్). నిమ్స్ డైరక్టర్ మనోహర్ మాట్లాడుతూ జూలై 7 నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని అన్నారు.

వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. మొదటి ఫేస్ 28 రోజులు వుంటుందని, వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం రెండ్రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు. ట్రయిల్స్ సక్సెస్ అయితే ఆగస్ట్ 15 నాటికి కోవాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి పని చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ ను దేశంలోని 12 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story