కాలేజీ విద్యార్థుల కరోనా పార్టీ.. అలబామా విద్యార్థుల ఆటవిక చర్య

X
ఓ పక్క కరోనాను కట్టడికి చేయలేక అమెరికా తల పట్టుకుంటుంటే అలబామా కళాశాల విద్యార్థులు కొవిడ్ పేరిట పార్టీలు జరుపుకుంటున్నారు. కొవిడ్ సోకిన వారిని పార్టీకి ఆహ్వానించి విందు చేసుకుంటారు. విందులో పాల్గొన్న వారిలో ఎవరికి వైరసోకుతుందో వారే విజేతగా ప్రకటించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అంతే కాకుండా ఆ తొలి కాంటాక్ట్ కు ప్రైజ్ మనీ కూడా అందజేస్తారు. టస్కలుసా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి పార్టీలు అధికంగా జరుగుతున్నాయని సిటీ కౌన్సిలర్ సొన్యా మెకెన్సీ తెలిపారు. అధికారులు, వైద్యులు ఈ పార్టీలు జరుగుతున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఇది బాధ్యతారాహిత్యమని, ఇలా చేస్తున్న విద్యార్థులకు దండన అవసరమని కౌన్సిలర్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
