కొవిడ్ భయం కొంచెం కూడా లేదు.. పెళ్లిళ్లు.. ఊరేగింపులు

కొవిడ్ భయం కొంచెం కూడా లేదు.. పెళ్లిళ్లు.. ఊరేగింపులు
X

రోజుకి ఇన్ని పాజిటివ్ కేసులు.. ఇంతమంది మరణించారు అని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది కానీ ప్రజలు మాత్రం యధావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పుట్టిన రోజులు, పెళ్లిళ్లు అంటూ వేడుకలు చేసుకుంటూ కరోనా బారిన పడుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా పెళ్లి ఊరేగింపులో చిందులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న అతిథులు కనీసం మాస్క్ ధరించలేదు.. సామాజిక దూరం సంగతి సరే సరి.

ఊరేగింపులో వరుడితో సహా అథిధులు మందేసి చిందేశారు. ఈ నెల 2వ తేదీన జరిగిన పెళ్లికి ఇతర ప్రాంతాల నుంచి అతిథులు వచ్చారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా అధికారులు వివాహ వేడుక జరిగిన హోటల్ మై ఫెయిర్ ను సీజ్ చేశారు. వరుడితో పాటు అతని తండ్రి, ముగ్గురు మామయ్యలను అరెస్టు చేసి ఊరేగింపులో పాల్గొన్న వాహనాలను సీజ్ చేశారు. కాగా ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య 8601కి చేరుకోగా, ఒక్క గంజాం జిల్లాలోనే 2066 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story