ఢిల్లీలో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం

ఢిల్లీలో ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం
X

ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ తోపాటు జాతీయ రాజధాని పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి.ఈ విషయాన్నీ భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ ఉరుములు , మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిందని..ఆదివారం తెల్లవారుజామునుంచి ఇది మొదలైందని పేర్కొంది. కాగా గత వారం రోజులుగా ఢిల్లీలో తీవ్రమైన వేడి వాతావరణం ఉంది. ఈ క్రమంలో వర్షాలు కురవడంతో చల్లటివాతావరణం ఏర్పడింది. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత శనివారం 39.8 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని ఐఎండి తెలిపింది. అయితే, ఆదివారం, గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Tags

Next Story