బీజేపీ ఎంపి బ్రిజేంద్ర సింగ్ కు కరోనా పాజిటివ్

బీజేపీ ఎంపి బ్రిజేంద్ర సింగ్ కు కరోనా పాజిటివ్
X

బీజేపీ ఎంపి బ్రిజేంద్ర సింగ్ శనివారం కరోనా భారిన పడ్డారు. ఆయనకు రెండు రోజులకిందట జరిపిన కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ అని తేలింది, బ్రిజేంద్ర సింగ్ హిసార్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్నిరోజులుగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ కోసం శాంపిల్స్ ను ఇచ్చారు. ఆ తరువాత ఒక వీడియో విడుదల చేశారు. అందులో తనను కలిసిన వ్యక్తులను కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అలాగే అన్ని భద్రతా జాగ్రత్తలు పాటించాలని అభ్యర్థించారు. కాగా బ్రిజేంద్ర సింగ్ , హర్యానాలో బలమైన నాయకుడుగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ కుమారుడు. 26 సంవత్సరాల వయసులోనే యుపిఎస్‌సి ఉత్తీర్ణత సాధించిన బ్రిజేంద్ర.. 1998 బ్యాచ్ ఐఎఎస్ కు ఎంపికయ్యారు. 2019 లో ఉద్యోగం నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలిప్రయత్నంలోనే హిసార్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.

Tags

Next Story