పక్కన కూర్చున్న వ్యక్తికి పాజిటివ్.. సీఎం అలర్ట్

పక్కన కూర్చున్న బీజేపీ నేతకు పాజిటివ్ రావడంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ అప్రమత్తమయ్యారు. వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ నెల ఒకటవ తేదీన బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ఆ కౌన్సిల్ చైర్ పర్సన్, బీజేపీ నేత అవధేశ్ నారాయణసింగ్ పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. ఆయన పక్కన మరో ముగ్గురు నాయకులు కూర్చున్నారు.
ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి, మంత్రులు శ్రావణ్ కుమార్, మంగళ్ పాండే, వినోద్ నారాయణ్, బీహార్ శాసనమండలిలో బీజేపీ విప్ రీనా యాదవ్, ఎమ్మెల్యేలు అబ్దుల్ బారి సిద్ధిఖీ, భోలా యాదవ్ తదితరులున్నారు. కాగా, నారాయణ సింగ్ కు శుక్రవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంతో హాజరైన నాయకులంతా కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. కాగా, బీహార్ లో కొవిడ్ తో ఆరుగురు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 84. గడిచిన 24 గంటల్లో 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసులు 11,111కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com