ఇక ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు

ఇక ట్రాన్స్‌జెండర్లకు పింఛన్లు
X

ఒడిశా ప్రభుత్వం కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ట్రాన్స్ జెండర్లకు పింఛను ఇచ్చేందుకు నిర్ణయించింది. మధు బాబు పింఛన్ యోజన పరిథిలోకి ట్రాన్స్‌జెండర్లను చేర్చేందుకు సీఎం నవీన్ పట్నాయక్ ఆమోదం తెలిపారు. ఇదే అంశంపై మాట్లాడిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అశోక్ పాండా వ‌ృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా మధుబాల పింఛన్ యోజన పరిథిలోకి తీసుకురావలనే ప్రతిపాదనను సీఎం నవీన్ పట్నాయక్ ఆమోదించారని అన్నారు. ఒడిశాలో సుమారు 5 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని.. వారి వయసును బట్టి 500 రూపాయల నుంచి 900 రూపాయలు పింఛను వారికి లభించనుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీను తాము నరవేర్చామని ఆయన మంత్రి అశోక్ పాండా అన్నారు.

Tags

Next Story