గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుడు అరెస్ట్

గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుడు అరెస్ట్
X

ఉత్తర్ ప్రదేశ్ ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుడు దయశంకర్ అగ్నిహోత్రిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. అతని ద్వారా గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే సమాచారాన్ని రాబడుతున్నారు. దాడి సమయంలో అతను వికాస్‌తోనే ఉన్నట్టు పోలీసులు తెలిపాడు. అతనిపై 50 వేల రివార్డు కూడా ఉంది. వికాస్ కాల్పులకు పాల్పడిన తుపాకీ తన పేరు తోనే ఉన్నట్టు దయశంకర్ అగ్నిహోత్రి పోలీసులకు చెప్పాడు.

పోలీసుల దాడులకు ముందే వికాస్‌కు సమాచారం వచ్చిందని.. ఈ క్రమంలోనే పక్కా

ప్రణాళిక రచించాడని చెప్పారు. దాడికి మొత్తం 25 నుంచి 30 మందిని సిద్ధం చేశాడని.. వారికి ఆయుధాలు కూడాసమకూర్చినట్టు వెల్లడించాడు. కాగా గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబెనుఅరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లిన క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోగా.. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Tags

Next Story