శ్రీలంక యువ క్రికెటర్‌‌ కుశాల్ మెండిస్ అరెస్టు

శ్రీలంక యువ క్రికెటర్‌‌ కుశాల్ మెండిస్ అరెస్టు

శ్రీలంక యువ క్రికెటర్‌‌ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో సబ్‌ఆర్బ్‌లోని పనదురా ప్రాంతంలో ఆదివారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్ తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెండిస్ ను అరెస్ట్ చేశారు.

మెండిస్‌ను ఆదివారమే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో మెండిస్‌తోపాటు సదరు వృద్ధుడు ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారా అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. 25 ఏళ్ల వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ అయిన మెండిస్‌ శ్రీలంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టీ 20లు ఆడాడు.టెస్టుల్లో 2995 పరుగులు, వన్డేల్లో 2167 పరుగులు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story