ఆస్ట్రేలియాకు వెళ్లే వందేభారత్ విమానాలు రద్దు

X
By - TV5 Telugu |5 July 2020 10:57 PM IST
ఆస్ట్రేలియాలో చిక్కుక్కున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ కింద ఈ నెల 4 నుంచి 14 వరకూ ఎయిర్ ఇండియా విమానాలు నడిపేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ విమానాలు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనా నేపధ్యంలో ఆస్ట్రేలియా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, రీ షెడ్యూల్ చేసిన అన్ని ప్లైయిట్లను జూలై 15 నుంచి నడుపుతామని తెలిపింది. కాగా.. ఇప్పటి వరకూ వందేభారత్ మిషన్ ద్వారా 700 విమానాల్లో 1.50 లక్షల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com