ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపు

ఐటీ రిటర్న్‌ల గడువు పొడిగింపు
X

2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్థికసంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును మరోసారి పొడిగించింది. ఐటి రిటర్నులు నవంబర్‌ 30 లోపు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆదాయపన్ను శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. వాస్తవానికి రెండురోజుల క్రితమే ఐటీ రిటర్న్‌ల గడువును ఈనెల 31కి పెంచిన కేంద్రం... తాజాగా మరో 4 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.అంతేకాదు టీడీఎస్, టీసీఎస్‌ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు కూడా ఆఖరు తేదీని కూడా ఐటీశాఖ ఆగస్ట్‌ 15 దాకా పెంచింది.కాగా ఐటీ కడితే హౌసింగ్‌ లోన్లు, జీవిత బీమా, పీపీఎఫ్‌ ఇతరత్రా మినహాయిం పులను క్లెయిమ్‌ చేసుకొనే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

Tags

Next Story