వికాస్ దూబే ఘటనలో ముగ్గురు పోలీసులు సస్పెండ్

కాన్పూర్ లో పోలీసులను కాల్చి చంపి గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పరార్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. ఈ వ్యవహారంలో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వారు ముగ్గురు చాలా రోజుల నుంచి దూబేతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన జరగటానికి ముందు కూడా.. పోలీస్ రైడ్ జరుగుతుందని ఆ ముగ్గురు వికాస్ దూబేకు ముందుగా సమాచారం అందించారని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. దీంతో వారిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి ముందు వారి కాల్ డేటా కూడా పరిశీలించామని తెలిపారు. కాగా.. రెండు రోజుల క్రితం వికాస్ దూబేను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు వెల్లగా.. పోలీసులను కాల్చి చంపిన ఆ గ్యాంగ్.. పారిపోయిన విషయం తెలిసిందే. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోగా.. కొంత మందిని ఎన్ కౌంటర్ చేశారు. వికాస్ దూబే తల్లి సరళా దేవి ఈ ఘటనపై స్పందిస్తూ... తన కొడుకు చేసినది తప్పు అని.. దూబేను ఎన్ కౌంటర్ చేయాలని అన్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com