పేడ కొననున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం

X
By - TV5 Telugu |6 July 2020 9:01 PM IST
చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి ఆవు పేడ కొనాలని నిర్ణయించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. పశుసంపదను వృద్ది చేసేందుకు ప్రారంభించిన గోధన్ న్యాయ్ పథకంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కిలో పేడకు రూ.1.50 గా ధర నిర్ణయించారు. ఇలా సేకరించిన పేడతో సేంద్రియ ఎరువు తయారు చేయనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం భూపేశ్ భాఘేల్ ఈ సందర్భంగా తెలిపారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు దీనిని సేకరిస్తారు. పేడ సేకరణను గ్రామాల్లో ప్రత్యేకంగా గోధన్ కమిటీలు, నగరంలో పురపాలక సంఘాలు, ఇతర అటవీ శాఖ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com