మొన్న కరోనా.. నిన్న జీ4.. నేడు బుబోనిక్ ప్లేగ్: వరుస వైరస్ లు అందిస్తున్న చైనా

మొన్న కరోనా.. నిన్న జీ4.. నేడు బుబోనిక్ ప్లేగ్: వరుస    వైరస్ లు అందిస్తున్న చైనా

కరోనా చాల్లేదా.. నిన్న జీ4 అన్నారు.. ఈ రోజు ప్లేగ్ అంటున్నారు. ఏం జరుగుతోంది చైనాలో.. ఒకపక్క కరోనా నుంచి బయటపడలేక ఛస్తుంటే.. మరోపక్క జీ4 గురించి, ప్లేగ్ గురించి చెబుతున్నారు. అడవి ఉడుత మాంసం అమ్మే ఇద్దరు వ్యక్తుల నుంచి ప్లేగు వ్యాధి కేసులు బయటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం వెల్లడించింది. జూలై 1న ప్లేగ్ వ్యాధి నిర్ధారణ అయిందని తెలిపింది. ఈ ఇద్దరితో పాటు వారితో కాంటాక్ట్ అయిన మరో 146 మందిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీన్ని బుబోనిక్ ప్లేగ్ అంటారు. ఇక ఈ వ్యాధిపై మంగోలియా అలెర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపింది అక్కడి ప్రభుత్వం.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవెల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరియా కీటకాల ద్వారా ఇతర జంతువులకు, మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అని 24 గంటల్లో వైద్యం అందకుంటే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది. గతేడాది మంగోలియాలోని బయాన్ ఉల్గీ ప్రాంతంలో అడవి ఉడుత యొక్క పచ్చి మాంసం తిని బుబోనిక్ ప్లేగ్ వ్యాధి బారినపడ్డ ఇద్దరు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story