హైదరాబాద్ లో నేటినుంచి మెరుగైన వైద్యానికి TIMS సేవలు

హైదరాబాద్ లో నేటినుంచి మెరుగైన వైద్యానికి TIMS సేవలు
X

తెలంగాణాలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరిన్ని చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఏర్పాట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రులలోను బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటోంది.

మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా హోటల్స్ ను కూడా ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ TIMS ను రెడీ చేసింది. దీన్ని ఇవాళ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ నేతృత్వంలోని అధికారుల టీమ్ పరిశీలించింది.

Tags

Next Story