మధ్యప్రదేశ్‌లో మ‌రింత‌గా విజృంభిస్తోన్న కరోనా పాజిటివ్ కేసులు

మధ్యప్రదేశ్‌లో మ‌రింత‌గా విజృంభిస్తోన్న కరోనా పాజిటివ్ కేసులు
X

దేశంలో క‌రోనా విలయతాండవం చేస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్ ప్రాంతంలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అలాగే రాజధాని భోపాల్‌లో కరోనా మ‌రింత‌గా విజృంభిస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 326 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,930కు చేరింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 608 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story