భారత్ లో కరోనా రికవరీ రేటు 60.77 శాతం

భారత్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ 24 గంటల్లో కేవలం 24 వేల కేసులు, 613 మరణాలను నివేదించింది. దాంతో మొత్తం 673,000 కేసులకు,19,268 మరణాలకు చేరుకుంది, కేసుల జాబితాలో భారత్ మూడో స్థానానికి ఎగబాకిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
అమెరికా 28 లక్షలు , బ్రెజిల్ 15 లక్షలు తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. మొత్తం పాజిటివ్ కేసులలో 4,24,433 మంది రికవరీ అయ్యారు. దీంతో రికవరీ రేటు 60.77 శాతంగా నమోదయ్యింది. ప్రస్తుతం సోమవారం నాటికి యాక్టీవ్ కేసులు 2,53,287 ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల మార్కును దాటగా.. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 7,074 కేసులు, తమిళనాడులో 4,280 కేసులు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com