తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో కరోనా అలజడి

తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో కరోనా అలజడి
X

కరోనా మహమ్మారి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. రాజమహేంద్రవరంలో వైసీపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పార్టీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆయనతో కాంటాక్ట్ ఆయన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అంతేకాదు జిల్లాలోని ఒక ఎంపీకి సంబంధించిన ఇద్దరు అనుచరులకు, ఒక మంత్రి వద్ద పనిచేసే వ్యక్తికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

దీంతో ఇప్పటిదాకా వీరితో సన్నిహితంగా ఉన్నవారిలో కలవరం మొదలైంది. వీరంతా కరోనా టెస్టులకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వెంటనే పరీక్షలు నిర్వహించి రిపోర్టులు ఇవ్వాలంటూ వైద్యసిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కరోనా టెస్టులకు గంటల తరబడి నిలిచిన వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తమ రిపోర్టులు రావడానికి చాలా ఆలస్యం అవుతుందంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story