రష్యాను అధిగమించిన భారత్.. 10 రోజుల్లో కేసులు చూస్తే..

రష్యాను అధిగమించిన భారత్.. 10 రోజుల్లో కేసులు చూస్తే..

భారత్ లో కరోనావైరస్ కేసులు ఆదివారం రష్యాను మించిపోయాయి. మొత్తం 6 లక్షల 85 వేల 85 మందికి వైరస్ సోకగా.. రష్యాలో 6 లక్షల 81 వేల 251 కేసులున్నాయి. దీంతో భారత్ మూడవ స్థానంలో ఉంది. 6.85 లక్షల కేసులు రావడానికి 158 రోజులు పట్టింది. ప్రతిరోజూ సగటున 22 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. ఒక్క జూన్‌ మాసంలోనే 3 లక్షల 87 వేల 425 కేసులు వచ్చాయి. గత 10 రోజులలో భారత్ లో 2 లక్ష 919 కేసులు వస్తే.. రష్యాలో మాత్రం 67 వేల 634 కేసులు వచ్చాయి.

రష్యాలో జనవరి 31 న సంక్రమణ మొదటి నివేదించినప్పటినుంచి.. మూడు నెలల్లో లక్ష కేసులు వచ్చాయి.. ఏప్రిల్ 30న, ఇక్కడ రోగుల సంఖ్య 1 లక్ష దాటింది. ఆ తరువాత 11 రోజులలో 2 లక్షలకు పెరిగింది, 10 రోజులలో మూడు లక్షలకు .. అలాగే 3 నుండి 4 లక్షల కేసులకు 11 రోజులు పట్టింది. 4 నుండి 5 లక్షల కేసులు నమోదు కావడానికి 12 రోజులు పట్టింది. ఇక 5 నుండి 6 లక్షలు కేసులు నమోదు కావడానికి 14 రోజుల సమయం పట్టింది.

అదేవిధంగా భారత్ లో చూస్తే.. జనవరి 30న మొదటి సంక్రమణ కేసు నివేదించిననాటినుంచి.. 110 రోజుల్లో లక్ష కేసులొచ్చాయి. ఆ తరువాత 15 రోజుల్లో 2 లక్షలు దాటగా.. 2 నుండి 3 లక్షలకు పెరగడానికి 10 రోజుల సమయం పట్టింది.. ఇక 8 రోజుల కాలంలో 3 నుండి 4 లక్షల కేసులకు పెరిగింది. ఆ తరువాత 6 రోజులలోనే 4 నుండి 5 లక్షల కేసులకు పెరిగాయి.. 5 నుండి 6 లక్షలు కావడానికి 5 రోజుల సమయం మాత్రమే పట్టింది.

Tags

Read MoreRead Less
Next Story