ఒక్కరోజు బిల్లు లక్ష రూపాయలా.. ప్రశ్నించిన పేషెంట్ ని..

ఒక్కరోజు బిల్లు లక్ష రూపాయలా.. ప్రశ్నించిన పేషెంట్ ని..

ఓ ఆస్పత్రికి డీఎంవో.. అయినా ఒక్క రోజు వైద్యం చేయించుకుంటే లక్ష రూపాయిలు బిల్లేశారు వైద్యులు. కరోనా వైద్యానికి కాసులన్నీ కరిగిపోతాయేమో అనిపిస్తోంది ఈ వ్యవహారం చూస్తుంటే.. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి వచ్చారు ఫీవర్ ఆస్పత్రికి చెందిన డీఎంవో సుల్తానా. ఆమె కరోనా లక్షణాలతో చాదర్ ఘాట్ వద్ద ఉన్న తుంబే ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఒకే ఒక్క రోజు వైద్యం అందించి డిశ్చార్జ్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఇంటికి వెళ్లే ముందు బిల్లు చేతిలో పెట్టారు. దాన్ని చూసి షాకయ్యారు సుల్తానా. ఇదేంటి ఇంత బిల్లు వేశారు అని ప్రశ్నించడం ఆమె తప్పైంది. వెంటనే ఆమెని ఆస్పత్రి యాజమాన్యం నిర్భంధించింది. ప్రశ్నించినందుకు ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన పనిష్మెంట్ ఇది అని వివరిస్తూ ఓ సెల్శీ విడియో తీసుకున్నారు. వైద్యులు చికిత్స కూడా సరిగా అందించలేదని సుల్తానా వాపోయారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story