సీఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ

సీఎం జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ
X

ఏపీలోని క్వారంటైన్ సెంటర్లలో కరోనా బాధితులకు సరైన సేవలు అందించడం లేదని సిపిఐ మండిపడుతోంది. రోగులు త్వరగా కోలుకోవాలంటే ఇమ్మ్యూనిటి పెంచే ఆహరం కావాలి.. కానీ ప్రభుత్వం ఇదేమి పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. క్వారంటైన్ సెంటర్లలో ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని మాడిపోయిన చపాతీలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నీళ్లలాంటి సాంబారు, ఉప్పూకారం లేని కూరలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచినీళ్లు మందులు దొరకగా ఇబ్బంది పడుతున్నారు.

క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్నవారికి సరైన మెరుగైన సేవలు అందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. నాణ్యమైన భోజనం, మంచినీళ్లు, మందులు కరువై జనాలు దీనావస్థలో మగ్గుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నా కాంట్రాక్టర్లు, అధికార యంత్రంగా చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కలెక్టర్, ఫుడ్ ఏజన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story