నాగాలాండ్‌లో కుక్క మాంసం నిషేధం

నాగాలాండ్‌లో కుక్క మాంసం నిషేధం
X

నాగాలాండ్ ప్రభుత్వం కుక్క మాంసం నిషేధించింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాగాలాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కుక్క మాంసాన్ని తినడం శతాబ్దాలుగా ఆచారంగా.. సాంప్రదాయంగా వస్తుందని అంటున్నారు. దానిని రద్దు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆచారవ్యవహారాలను కాలదన్నే అధికారం ప్రభుత్వాలకుండబోదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలో ఓ ఉద్యమాన్ని చేపట్టాలని నాగాలాండ్ లోని కొన్ని ప్రజా సంఘాలు యోచిస్తుండడం గమనార్హం. కాగా.. కుక్క మాంసంపై ఇప్పటికే మిజోరం రాష్ట్రంలోనిషేధం అమల్లో ఉంది. అయితే కుక్క మాంసం నిషేధంపై జంతు ప్రేమికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story