పసిడి ధర తగ్గింది.. పది గ్రాముల బంగారం..

పసిడి ధర తగ్గింది.. పది గ్రాముల బంగారం..
X

బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత బుధవారం రికార్డు స్థాయిలో 10 గ్రాముల బంగారం రూ.48,982లు పలుకగా నాలుగు రోజుల్లో ఏకంగా రూ.1000 లు తగ్గింది. సోమవారం పదిగ్రాముల పసిడి 0.34 శాతం తగ్గి రూ.47,882 లకు చేరింది. ఇక వెండి ధర విషయానికి వస్తే 0.36 శాతం పతనమై రూ.49,000 తగ్గింది. అందర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్ ధర 1772 డాలర్లకు దిగివచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దాని ప్రభావం పసిడిపై పడిందని, ధరలు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags

Next Story