ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి..

ప్రియాంక బంగ్లా బీజేపీ ఎంపీకి..
X

ఢిల్లీలోని ప్ర‌భుత్వ బంగ‌ళాను ఆగస్ట్‌ 1లోగా ఖాళీ చేయాలంటూ సోనియాగాంధి కూతురు ప్రియంక గాంధీకి కేంద్రం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక గాంధీ కుటుంబం ఖాళీ చేసిన అనంతరం ఆ బంగాళాను బీజేపీ ఎంపీ, మీడియా సెల్ ఇన్‌ఛార్జి అనిల్ బ‌లూనికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం అనిల్ బ‌లూని గురుద్వారాలోని రాకాబ్ గంజ్ రోడ్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కొద్దిరోజుల కిందట ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో త‌న నివాసాన్ని మార్చాలంటూ కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయ‌న క్యాన్స‌ర్ చికిత్స తీసుకొని కోలుకున్న‌ప్ప‌టికీ అనేక జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని డాక్ట‌ర్లు సూచించడంతో ఆయనకు లోథీ బంగాళాను కేటాయించినట్టు తెలుస్తోంది. కాగా ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఎస్పీజీ భద్రత పరిధిలో లేరు.. దాంతో లోథీ రోడ్‌లోని బంగళాను ఖాళీ చేయాలని ఇటీవ‌ల పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ నోటిసులు ఇచ్చింది.

Tags

Next Story