పానీపురి మెషీన్.. అచ్చంగా ఏటిఎం మాదిరిగానే..

రోడ్డు పక్కన బండి.. బండి చుట్టూ లొట్టలేసుకుంటూ తినే పానీపురి ప్రియులు.. పూరీని కుండలోని నీటిలో ముంచీ.. తీసి ఇస్తుంటే అద్భుతహా! అంటూ సాయింత్రాలు సరదాగా ఫ్రెండ్స్ తో ఓ రెండు మూడు ప్లేట్లయినా లాగించే నగర వాసులు ఏమైపోయారు. ఎక్కడికి వెళ్లారు. బహుశా ఇంట్లోనే పానీపూరీ ఎలా చేస్కోవాలి అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారా.. కరోనా సీజన్.. బయటకు రావాలంటేనే భయం.. ఇంక పానీపూరీ ఎక్కడ తినేది.. అందుకే మీ అవసరాన్ని గుర్తించి అర్జంట్ గా ఓ పానీపురీ ఏటీఎం మిషన్ ని తయారు చేశారు..
లాక్ డౌన్ సమయంలో ఖాళీగా కూర్చోకుండా బుర్రకు పదునుపెట్టారు ఓ వ్యక్తి. ఇది మన భారతీయుడు రూపొందించిన ఓ అద్భుత సృష్టి అంటూ అసోంకు చెందిన అదనపు డీజీపీ హర్దిసింగ్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అచ్చంగా మనీ తీసుకునే ఏటీఎం మాదిరిగానే పని చేస్తుంది. డబ్బులు మిషన్ లో పెట్టి ఎన్ని కావాలో బటన్ నొక్కితే అన్ని పూరీలు వచ్చేస్తాయి. హ్యాపీగా, నీట్ గా ఉండే పానీపూరీలు లాగించేయొచ్చు.
తనకి ఈ మెషీన్ రూపొందించడానికి ఆరు నెలల సమయం పట్టిందని చెబుతున్నారు. అదెలా పని చేస్తుందో కూడా వివరించారు వీడియోలో ఉన్న వ్యక్తి. ఇక ఏ టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ పానీపురీ అందిస్తుందట మెషీన్. మనుషులతో పనిలేకుండా అన్నీ మెషినే అందిస్తుందట. హమ్మయ్య.. ఈ మెషీన్ ఏదో త్వరగా మార్కెట్లోకి వస్తే అప్పుడైనా పానీపురీ తినొచ్చేమో ట్రై చేద్దాం..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com