జమ్మూకాశ్మీర్ లో మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

జమ్మూకాశ్మీర్ లో మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
X

నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది, ఆదివారం సాయంత్రం జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లా ఫార్వర్డ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. గత 24 గంటల్లో రెండవ ఉల్లంఘనగా తెలుస్తోంది.

రాత్రి 7.45 గంటల సమయంలో, పూంచ్ జిల్లా బాలకోట్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట చిన్న ఆయుధాలతో కాల్పులు , మోర్టార్లతో షెల్లింగ్ చేయడం ద్వారా పాకిస్తాన్ అప్రజాస్వామిక కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించింది.

అయితే ఇందుకు భారత దళాలు కూడా సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకున్నాయి అని జమ్మూకు చెందిన రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్ల్ దేవేందర్ ఆనంద్ అన్నారు. కాగా శనివారం కూడా పాకిస్తాన్ ఈ జిల్లాలో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. దీనికి భారత వైపు నుండి వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. మెన్ధార్ సెక్టార్లో జరిగిన కాల్పులలో పాకిస్థాన్ కు చెందిన సుబేదార్ సహా ఇద్దరు సైనికులు మరణించగా, రాఖ్ చిక్రీ, పూంచ్ లోని దేవా , రాజౌరిలలో ఒక్కొక్కరు గాయపడ్డారు.

Tags

Next Story