అయ్యో పాపం.. అమ్మకెంత కష్టం

అయ్యో పాపం.. అమ్మకెంత కష్టం

అమ్మా.. నేను బడికెళ్లి బాగా చదువుకుని పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటాను అని అంటే ఆ తల్లి ఎంత మురిసిపోతుంది. మురిపెంగా దగ్గరకు తీసుకుని నీకెందుకయ్యా అంత కష్టం. మా తిప్పలేవో మేం పడతాం. నువు బాగుంటే అంతే చాలు అంటుంది అమ్మ కొడుకు మాటలకి మురిసిపోతూ..

మరి పెద్దయ్యాక ఆ తల్లినే నడిరోడ్డు మీద వదిలేస్తే.. బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన కిష్టమ్మ. భర్త మృతి చెందడంతో మేడ్చల్ జిల్లాలోని అన్నోజిగూడకు వచ్చి స్థిరపడింది. 80 ఏళ్ల కిష్టమ్మకు అయిదుగు పిల్లలు.. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు, కూతురు మృతి చెందగా.. మిగతా సంతానం అన్నోజిగూడ, నాచారం, జడ్చర్లలో స్థిరపడ్డారు. కిష్టమ్మ పిల్లలపై ఆధాపడకుండా యాచిస్తూ జీవనం గడుపుతోంది. అలా వచ్చిన రూ.40 వేలకు పైగా పోగు చేసి ఆ డబ్బంతా కట్టుబట్టలు, దుప్పట్లు, బొంతల్లో దాచుకుంది.

ఇటీవల అనారోగ్యానికి గురవడంతో నాచారంలోని కుమారుడి వద్దకు వెళ్లింది. ఆస్పత్రికి తీస్కెళ్లమని తన దగ్గర రూ.40 వేలు ఉన్నాయని చెప్పింది. సరేనన్న కొడుకు, కోడలు ఆమెను ఆస్పత్రికి తీస్కెళ్తామని ఆటో ఎక్కించారు. ఆమెను భువనగిరికి తీసుకొచ్చి బస్టాండ్ సమీపంలో వదిలిపెట్టి. ఆమె వద్ద ఉన్న డబ్బంతా తీసుకుని మందులు తీసుకొస్తామని వెళ్లిపోయారు. మూడు రోజులైనా కొడుకు, కోడలు రాలేదు. దాంతో మోసపోయానని గ్రహించింది కిష్టమ్మ. తనను జడ్చర్లలోని కుమార్తె వద్దకు చేర్చమని కనిపించిన వారినల్లా ప్రాధేయపడుతోంది.

Tags

Next Story