వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు..

వరుసగా 13 రోజులపాటు రోజుకోవిధంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.80.43 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.80.53 వద్ద నిలకడగా ఉంది. ఇటు ఆర్ధిక రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ.87.19 యధాస్థితిలోనే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.83 వద్ద నిలకడగానే ఉంది.
ఇక హైదరాబాద్‌లో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 గానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.69 స్థిరంగానే కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర ధర రూ.83.82 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.78.98 గానే ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా రూ.83.43 ఉండగా.. డీజిల్ ధర కూడా రూ.78.62 వద్ద నిలకడగానే కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా ఏడో రోజు కావడం విశేషం.
ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మిశ్రమంగా కదులుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.35 శాతం పెరిగి 42.95 డాలర్లకు చేరుకుంది. అలాగే డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.62 శాతం తగ్గి 40.39 డాలర్లకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com