మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా.. ఒకరి మృతి

మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనం బోల్తా.. ఒకరి మృతి
X

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్ లోని పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)‌పై జరిగింది. వాహనం ప్రమాదానికి గురైంది. బాలినేని ఎస్కార్ట్ వాహనం ఓఆర్‌ఆర్ మీద వెళుతుండగా ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయింది. దాంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్‌‌కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో మృతిచెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.

Tags

Next Story