బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఈ కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ టచ్ చేస్తోంది. ఈ మహమ్మారి రాజకీయ నేతలను, పోలీసులను, డాక్టర్లను, జర్నలిస్టులను.. చివరకు దేశాధినేతలనూ కూడా వదిలిపెట్టడం లేదు.
తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా సోకింది.
65 ఏళ్ల బోల్సోనారోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం ఆయన స్వయంగా వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని, మధ్యస్థంగా కరోనా లక్షణాలున్నాయని పేర్కొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకూ బోల్సోనారో మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించున్నారు. రెండుసార్లు నెగెటివ్ వచ్చింది. మూడోసారి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. కాగా, ప్రపంచంలోనే కరోనా కేసుల్లో బ్రెజిల్ అమెరికా తర్వాతి స్థానంలో నిలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com