విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ సిలబస్ తగ్గింపు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీబీఎస్ఈ సిలబస్ తగ్గింపు
X

విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించింది.

9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags

Next Story