నన్ను మంత్రిని చేయండి.. లేదా వారిని మంత్రులుగా తొలగించాలి.. సీఎంకు ఓ సామాన్యుడి లేఖ

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ సామాన్యుడు లేఖ రాశాడు. అయితే, తనకు ఉన్న సమస్య గానీ, తన చుట్టు పక్కల వారికి ఉన్న సమస్యగానీ లేఖ ద్వారా తెలియజేస్తే.. అది సహజమే అనుకోవచ్చు. కానీ, బాల్‌చంద్‌వర్మ అనే వ్యక్తి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాస్తూ.. తనకు మంత్రి వర్గంలో చోటుకల్పించాలని లేఖ ద్వారా కోరాడు. ఇటీవల మధ్యప్రదేశ్ లో కేబినేట్ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. అయితే, కొత్తగా మంత్రిమండలిలో చేరిన 14 మంది రాష్ట్రశాసనసభలో సభ్యులు కానివారే అవ్వడం గమనార్హం. దీంతో ఆ సామాన్యుడు సీఎంకు రాసిన లేఖ సంచలనంగా మారింది. 14 మంది శాసనసభ సభ్యులు కానివారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారని.. అలాగే తనను కూడా మంత్రిని చేయాలని లేఖలో కోరాడు. లేనియడల ఆ 14 మంది మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసాడు. అయితే, తన డిమాండ్లకు మూడు రోజులు గడువు కూడా విధించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com