శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర

గోల్డ్ కోనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. పసిడి ధర మళ్లీ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరిగినా.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గింది. ఓ దశలో పసిడి ధర ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. ఇప్పటికే రూ.50 వేల మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు అందుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి నుంచి పతనమైంది. ఇదంతా గడిచిన నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకుంది.
అయితే దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో మంగళవారం పసిడి ధర పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.48,100కు చేరింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,100కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గుదలతో రూ.50,710కు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com