ఎంసీఎల్‌ఆర్ రేటును తగ్గించిన ఎస్‌బీఐ

మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ రేటును 6.65 శాతానికి తగ్గిస్తున్నట్టు దేశీయ దిగ్గజ సంస్థ ఎస్‌బీఐ ప్రకటించింది. తగ్గింపు నిర్ణయం ఈనెల 10 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో MCLR రేటును ఎస్‌బీఐ వరుసగా 14వసారి తగ్గించినట్లయింది. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది.
ఎంసీఎల్‌ఆర్ రేటు తగ్గింపుతో వరుసగా మూడో రోజూ ఎస్‌బీఐ లాభాల్లో ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో ఎస్‌బీఐ 3 శాతం పైగా లాభపడి రూ.194.10 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి బుధవారం ఉదయం 9:36 నిమిషాల వరకు దాదాపు 2.09 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.
ఇక ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.168,273.55 కోట్లకు చేరింది. ఇండస్ట్రీ పీ/ఈ 14.54 కాగా, కంపెనీ పీ/ఈ 11.62గా ఉంది. బుక్ వేల్యూ రూ.236.14, ఈపీఎస్ రూ.16.23గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com