నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

X
నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరినా అందుకు ఒప్పుకోలేదు. ఎస్ఈసి పోస్టు ఎక్కడ ఖాళీగా ఉంది.. హైకోర్టు రిస్టోర్ చెయ్యమని కదా అని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్ఈసి పోస్టు ఖాళీగా లేనట్లే కదా అని వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి చూస్తే నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లేనని తాము భావిస్తున్నామని సిజెఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారిస్తామని చెబుతూనే తదుపరి విచారణ మూడు వారాలు వాయిదా వేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
