వారం రోజుల పాటు షట్ డౌన్..

వారం రోజుల పాటు షట్ డౌన్..
X

వైరస్ వ్యాప్తి నిరోధానికి ఏం చేస్తే తగ్గుతుందో అర్ధం కాని పరిస్థితిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వైరస్ కట్టడికి మరింత కఠిన చర్యలు చేపట్టనుంది. బుధవారం నుంచి ఇంగ్లీష్ బజార్, ఓల్డ్ మాల్డా పట్టణాల్లో వారం పాటు అన్నీ క్లోజ్ చేసి షట్ డౌన్ విధిస్తున్నామని అధికారులు తెలిపారు. మెడికల్ కు సంబంధించి, నిత్యావసరాలు తప్పించి దుకాణాలన్నీ మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. గౌర్ కన్యా టెర్మినల్ నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరిన తరువాత ఈ రెండు పట్టణాల్లో ఏ ఒక్క చోటనైనా ఆగిపోతాయని తెలిపారు. సైకిల్ రిక్షాలు, ఇ-రిక్షాలు కూడా అనుమతించేది లేదని తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాల్డాలో ఇప్పటివరకు 859 కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story