యూనిప్లై ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి

యూనిప్లై ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి
X

సైక్లోబెంజాప్రిన్‌ హైడ్రోక్లోరైడ్‌ ట్యాబ్లెట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ANDA అనుమతి లభించిందని యూనిప్లై ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఈ ట్యాబ్లెట్లను 5 ఎంజీ, 7.5 ఎంజీ, 10 ఎంజీ మోతాదుల్లో అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయించనుంది. జాన్సెన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన ఫ్లెక్స్‌రిల్‌కు ఈ ఔషధం జనరిక్‌ వెర్షన్‌.

భుజం నొప్పితో పాటు ఇతర నొప్పుల నివారణ, కండరాల చికిత్స కోసం ఈ ట్యాబ్లెట్లను వినియోగించనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. గోవాలోని ఉత్పత్తి ప్లాంట్‌లో ఈ ట్యాబ్లెట్లు తయారు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఇక యూనిప్లై ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం 5శాతం నష్టంతో రూ.6.39 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విషయానికి వస్తే రూ.107.13 కోట్లుగా ఉంది. ఇండస్ట్రీ పీ/ఈ 22.15 కాగా, కంపెనీ పీ/ఈ 4.3గా ఉంది. బుక్‌ వేల్యూ రూ.32.65, ఈపీఎస్‌ రూ.1.5గా ఉంది.

Tags

Next Story