అంతర్జాతీయం

మిస్సిస్సిప్పిలో 26 మంది శాసనసభ్యులకు కరోనా

మిస్సిస్సిప్పిలో 26 మంది శాసనసభ్యులకు కరోనా
X

అమెరికాలోని మిస్సిస్సిప్పిలో 26 మంది శాసనసభ్యులు, మరో 10 మందికి తాజాగా కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో శాసనసభ్యులను కలిసిన వారిలో టెన్షన్ మొదలయింది. పైగా వీరంతా జులై ఒకటి వరకూ జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. శాసనసభ్యులు కరోనా భారిన పడ్డారని ఆరోగ్య శాఖ అధికారి బుధవారం సమాచారం ఇచ్చారు.

174 మంది సభ్యులున్న మిస్సిస్సిప్పి రాష్ట్ర శాసనసభ వార్షిక సమావేశాలు జూలై 1 తో ముగుస్తాయి. ఈసారి జరిగిన సెషన్లో చాలా మంది ఎమ్మెల్యేలు ముఖాలకు మాస్కులు లేకుండా ఉండటంతో పాటు సామాజిక దూరాన్ని అనుసరించలేదని తెలుస్తోంది. కాగా మిస్సిస్సిప్పిలో ఇప్పటివరకు మిస్సిస్సిప్పి 32,888 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,188 మంది మరణించారు.

Next Story

RELATED STORIES