కలుషిత ఆహారం తిని 70 మందికి అస్వస్థత

X
విశాఖలో కలుషిత ఆహారం తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మన్యంలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురికావడం కలకలం సృష్టిస్తోంది.
మలకపాలెంలోని స్థానికులు విషాహారం తీసుకున్నారు. దీంతో వీరంతా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందర్ని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చనిపోయిన ఆవు మాంసం తినడం వల్లే అనారోగ్యం పాలయ్యారని డాక్టర్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
