ఆసియా కప్‌ను రద్దు చేసినట్లు ప్రకటించిన గంగూలీ

ఆసియా కప్‌ను రద్దు చేసినట్లు ప్రకటించిన గంగూలీ

సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో 'స్పోర్ట్స్ తక్'తో అన్నారు. కాగా ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించనుంది. అయితే, ఇప్పటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు.

గంగూలీ టోర్నమెంట్ రద్దు చేయడానికి ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. అయితే, కరోనావైరస్ దీనికి ప్రధాన కారణం కావచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టి 20 ప్రపంచ కప్ కూడా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Next Story