బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్‌ను ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఐదుగురు బాలీవుడ్ ప్రముఖులు మరణించారు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ మరణించారు.

తాజాగా ప్రముఖ నటుడు జగ్‌దీప్ కన్నుమాశారు. ఆయ వయస్సు 81 సంవత్సరాలు. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'షోలే' లో సూర్మా భూపాలి పాత్రతో ఆయన సినీ అభిమానులకు సుపరిచితుడు. ఆయన అసలు పేరు సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ. 'అందాజ్ అప్నా అప్నా' మూవీలో జగ్‌దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్‌దీప్ దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story